KCR: చేతులు లేపండి.. కెమెరాలు అటు తిప్పండి..!

KCR: తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి KCR ఎక్క‌డ ప్ర‌చారానికి వెళ్లినా ఆయ‌న నుంచి ఎలాంటి పంచ్‌లు వ‌స్తాయా అని ప్ర‌జ‌లు ఎదురుచూస్తుంటారు. ఆయ‌న సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు చేసే మంచి గురించి వివ‌రించేట‌ప్పుడు వినిపించే కేక‌ల కంటే ఆయ‌న నుంచి వ‌చ్చే స‌ర‌దా పంచ్‌ల‌కే ఎక్కువ ర‌చ్చ చేస్తుంటారు.

ఈరోజు మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌సంగంలో పాల్గొన్న కేసీఆర్.. రైతు బంధు గురించి 24 గంట‌ల క‌రెంట్ గురించి మాట్లాడారు. ఎవ‌రెవ‌రికి రైతు బంధు, 24 గంట‌ల క‌రెంట్ కావాలో చేతులు ఎత్తండి అని KCR అన్న‌ప్పుడు చాలా మంది జ‌నాలు చేతులు పైకి లేపారు. అప్పుడు KCR.. కెమెరాలు చేతులు ఎత్తే వారి వైపు తిప్పండ‌య్యా అని స‌ర‌దాగా అన్నారు. రైతు బంధు, విద్యుత్తు కావాలంటే మెద‌క్‌లో ప‌ద్మ దేవేంద‌ర్ రెడ్డిని (padma devender reddy) గెలిపించాల‌ని కోరారు.