KCR: కాంగ్రెస్ పీడ‌ను వ‌దిలించుకుందాం

ఈ తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ BRS పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పీడ‌ను వ‌దిలించుకుందాం అని అన్నారు సీఎం KCR. రేవంత్ రెడ్డి (revanth reddy) పోటీ చేస్తున్న కొడంగ‌ళ్‌లో (kodangal) KCR ప్ర‌చారంలో పాల్గొన్నారు. పార్టీ నుంచి కొడంగ‌ల్‌లో ప‌ట్నం న‌రేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సీఎం అన్న గౌర‌వం లేకుండా పిండం పెడ‌తా అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పీడ‌ను వ‌దిలించుకోవాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో అంగి పోయేదాకా జంపుతున్నరు.. ఇక్కడ కొడంగల్లో మీరు లాగు పోయేదాకా జంపాలి అని సీఎం KCR మాస్ డైలాగ్ కొట్టారు.