Telangana: KCR వదలకుండా ఉండాల్సింది
Telangana: పార్టీ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి జంప్ అవుతుంటారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎంత మంది ఎన్ని పార్టీలు మారారో చూసాం. అయితే ఒక నేత పార్టీ వీడుతున్నారు అని తెలిసినప్పుడు వారి సామర్ధ్యం ఏంటో కూడా తెలుసుకోగలగాలి. అప్పుడే ఏ పార్టీ అయినా బలపడుతుంది.
కానీ మాజీ సీఎం KCR ఈ విషయంలో తప్పు చేసారని పైనున్న మంత్రులను చూస్తే క్లియర్‌గా తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రులు టికెట్లు ఇవ్వడానికి ముందు వరకు BRS లోనే ఉన్నారు. ఎప్పుడైతే BRS టికెట్లు ఇవ్వరని తెలిసిందో ఆ వెంటనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పుడే కనీసం KCR ఆపి ఉన్నా సరిపోయేది. కానీ ఆయన అలా చేయలేదు. వెళ్లేవాళ్లను వెళ్లనివ్వడమే మంచిది అనుకున్నారు.
ఇప్పుడు ఈ ముగ్గురూ తమ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ఈ ముగ్గురినీ BRS పార్టీ వదులుకోకుండా ఉండి ఉంటే మరీ 38 సీట్లు అయితే వచ్చేవి కావు. బహుశా మరోసారి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశమూ ఉండేదేమో.