KCR: 6 నెలల తర్వాత మళ్లీ మనమే.. KCR కీలక వ్యాఖ్యలు
KCR: భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు కేసీఆర్ మరోసారి పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలకు ఎవ్వరూ లొంగొద్దని.. ఆల్రెడీ రాష్ట్రంలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైందని ఆరు నెలల్లో మళ్లీ అధికారంలోకి భారత రాష్ట్ర సమితి పార్టీనే వస్తుందని కేసీఆర్ నేతలతో అన్నారట. దాంతో ఈ ఆరు నెలల్లో ఏం జరగబోతోంది అనే ఆసక్తి మొదలైంది. ఆరు నెలల తర్వాత కూడా ఏ మార్పూ రాకపోతే ఆ తర్వాత పార్టీ మారాలనుకునేవారిని తాను ఆపనని కూడా చెప్పారట. కేసీఆర్‌తో సమావేశం అనంతరం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.