KCR: సిద్ధిపేట‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను

KCR in Siddipet:  సిద్ధిపేట‌కు (siddipet) ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని అన్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR. త‌న‌ను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకుని పెంచిన గడ్డ ఈ సిద్ధిపేట‌ గడ్డ అని సిద్ధిపేట‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “” జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్ధిపేట‌ పేరు విన్నా.. సిద్ధిపేట‌ భూమికి వచ్చినా.. సిద్ధిపేట‌ నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్ధిపేట‌ గడ్డ నన్ను సాకింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది “” అని తెలిపారు. గత ఎన్నిక‌ల్లో వచ్చిన రికార్డు మెజారిటీని తిరగరాస్తూ.. భారీ మెజారిటీతో హ‌రీష్ రావును గెలిపించాలని KCR ప్రజలకు పిలుపునిచ్చారు.