KCR: అలాంటివాళ్ల‌ను బ‌య‌టికి గెంటుతా

తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR ఎన్నిక‌ల శంఖారావం పూరించారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోయే వారి జాబితాను ప్ర‌క‌టించారు. మొత్తం 115 మంది అభ్య‌ర్ధుల పేర్లు ప్ర‌క‌టించారు. ఇంకో నాలుగు పెండింగ్‌లో ఉంచారు. ఇంకాస్త స్ట‌డీ చేసి ఆ నాలుగు పేర్ల‌ను కూడా ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యానికొస్తే.. మొత్తం ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. (telangana candidate list)

ఇక కేసీఆర్ ఈసారి రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌నున్నారు. ఎప్పుడూ గ‌జ్వేల్ నుంచే పోటీ చేసే KCR.. ఈసారి కామారెడ్డి (kama reddy) నుంచి కూడా పోటీ చేయ‌నున్నారు. ఇందుకు కార‌ణం కామారెడ్డి ఎమ్మెల్యే (kama reddy) ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ (gampa govardhan). ఆయ‌నే కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి పోటీ చేయ‌మ‌న్నారు. అందుకే ఒప్పుకున్నాన‌ని తెలిపారు. ఇక పార్టీలో టికెట్ ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా ఎవ‌రైనా యాంటీ పాలిటిక్స్ చేయాల‌ని చూస్తే పార్టీ నుంచి గెంటేస్తాన‌ని హెచ్చ‌రించారు.