KCR: మూడోసారి ప్రమాణ స్వీకారానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు
రేపు జరగబోయే పోలింగ్లో గెలుపు తనదేనని ధీమాగా ఉన్న ఆపద్ధర్మ సీఎం KCR.. మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీకే ప్రజలు మరోసారి పట్టం గడుతున్న నేపథ్యంలో, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం KCR సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో ప్రమాణ స్వీకారానికి కార్యక్రమాలు మొదలైపోయాయి. ప్రమాణ స్వీకార ముహూర్తం తేదీ, సమయం ఖరారు కోసం పురోహితులతో సీఎం సంప్రదిస్తున్నారట. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేయాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.