Telangana Election: కర్ణాటక వైబ్ కనిపిస్తోంది…!
Hyderabad: తెలంగాణలో (telangana election) కర్ణాటక వైబ్ కనిపిస్తోందనే చెప్పాలి. మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో BJP దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కన్నడ రాజ్యాన్ని కాంగ్రెస్ (congress) చేజిక్కించుకుంది. ఇందుకు కారణం 40% కమిషన్ అనే మాట ప్రజలకు కాంగ్రెస్ బాగా చేరవేయడమే. అంటే.. ప్రజలకు అందాల్సిన పథకాలు వారి వరకూ రావాలంటే BJP ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. అది ప్రజలకు బాగా అర్థమైపోయింది. దాంతో ఇక BJPకి గుడ్ బై చెప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారు. అలా అధికారం కాంగ్రెస్ చేజిక్కించుకుంది.
ఇప్పుడు ఇదే వైబ్ తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పుడు KCRది 30% కమిషన్ సర్కార్ అనే మాట వినిపిస్తోంది. ఇందుకు కారణం కొందరు BRS ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటమే. దళితులు, బీసీలకు ఆర్థిక సాయం అందించేందుకు KCR ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించిన బాధ్యతలన్నీ ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అప్పగించింది ప్రభుత్వం. (telangana election)
బీసీ, మైనారటీల పథకాలకు గానూ లబ్ధిదారులకు రూ.1 లక్ష ప్రకటించారు. ఇక గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల వరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఈ పథకాలు కావాలంటే లబ్ధిదారులు 30% లంచం ఇవ్వాలని కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు చేసినా KCR ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న కోపం లబ్ధిదారుల్లో బాగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు KCR ప్రభుత్వాన్ని కూడా 30% కమిషన్ సర్కార్ అనే ట్యాగ్ వసే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. కర్ణాటకలో జరిగినట్లు BRSకూ జరుగుతుందని రాజకీయ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.