KCR: మంచి రోజులొస్తాయి.. తొందరపడకండి
KCR: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్న వారి గురించి పట్టించుకోవద్దని.. పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్‌లోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని ఆయన ఎమ్మెల్యేలకు చెప్పారు. పార్టీని వీడతానంటే తాను ఆపను కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలని సూచించారు. ఎవ్వరూ తొందరపడొద్దని.. పార్టీకి త్వరలో మంచి రోజులు వస్తాయని నచ్చజెప్పే యత్నం చేసారు.