Telangana: KCR మాస్టర్ ప్లాన్..!
Telangana: మూడోసారి హ్యాట్రిక్ కొడతామని అనుకున్న భారత రాష్ట్ర సమితికి (BRS) ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికారాన్ని కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. అయినా ఏమాత్రం నిరాశచెందకుండా కనీసం లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అయినా విజయం సాధించాలని భారత రాష్ట్ర సమితి గట్టిగా కృషి చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేతలు నిరాశచెందకుండా వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోకూడదని భారతీయ జనతా పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. పొత్తు పెట్టుకుందాం అని భారతీయ జనతా పార్టీ నేతలను కలిసేందుకు వస్తున్న భారత రాష్ట్ర సమితి నేతల పట్ల తమ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. మరోపక్క లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు నమ్ముతున్నారు. ఎన్నికల్లో BRSను దెబ్బ తీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చు అనేది వారి భారతీయ జనతా పార్టీ నేతల ఆలోచన. భారత రాష్ట్ర సమితి నిజంగా దెబ్బ తింటే దాని ప్రభావం ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌పై కూడా పడుతుంది. భారత రాష్ట్ర సమితి దెబ్బతింటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కాని పని. (Telangana)
ALSO READ: కాంగ్రెస్ మంత్రులు బూతుల క్లాసులు తీసుకుంటున్నారా?
భారతీయ జనతా పార్టీతో భారత రాష్ట్ర సమితి కూడా ఎంతో కొంత బలంగా నిలబడడం కాంగ్రెస్ పార్టీకి అవసరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా ఉన్నప్పుడు KCR ప్రభుత్వం తమకు ఢోకా లేదన్న భరోసాతో ఉంది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో భారతీయ జనతా పార్టీ బలహీనపడటంతో KCR ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తన ఉనికి కోల్పోకుండా ఉండగలిగే కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా కవచంలా ఉపయోగ పడుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ముఖ్యులు కూడా గుర్తించారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ద్వితీయ స్థానంలో, భారత రాష్ట్ర సమితి తృతీయ స్థానంలో ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా కట్టడి చేయడం కేసీఆర్‌కు శక్తికి మించిన పని. శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఈటెల రాజేందర్, బండి సంజయ్ వంటి వారు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ గెలిస్తే వీరిద్దరిలో ఒకరు కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అందుకే రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉంటారు. ఏ కారణం వల్ల అయినా ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితికి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారని చెప్పలేం.
ALSO READ: Delhi Liquor Scam: BRS వర్గాల్లో హై టెన్షన్
ఛండీగడ్ మేయర్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో చూసాం. సుప్రీంకోర్టులో విచారణ జరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తిని నేరుగా ప్రకటించిన తర్వాత కూడా పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లను భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఇవి రోజులు కావు. ప్రధాని మోదీకి కూడా నైతికత కంటే గెలుపుకే ప్రాధాన్యత ఇస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందన్న విషయమై ఆసక్తి నెలకొంది. (Telangana)
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి కాలం అధికారంలో కొనసాగనిస్తారా? అనే సందేహం కూడా ఏర్పడింది. రేవంత్ రెడ్డికి కూడా ఏం జరుగుతోందో తెలుసు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురు కాబోతున్న ప్రమాదం నుంచి బయటపడటానికి రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శాసనసభలో ప్రస్తుతం ఎనిమిది సీట్లు మాత్రమే ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షం ముప్పును ఎదుర్కోవాల్సి రావడం నరేంద్ర మోదీ మహిమే అని చెప్పుకోవాలి.