Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. కేసీఆర్ హస్తం కూడా
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. వారం రోజుల క్రితం కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. కానీ కవితకు మాత్రం బెయిల్ రావడంలేదు. ఈ నేపథ్యంలో ఈడీ కొత్త వాదన వినిపిస్తోంది.
ఈ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం కూడా ఉందని అంటున్నారు. లిక్కర్ స్కాం గురించి కేసీఆర్‌కు అంతా తెలుసని దీని గురించి కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించింది. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలోనే తన లిక్కర్ టీం సభ్యులను కవిత పరిచయం చేసారని ఈడీ ఆరోపిస్తోంది. కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.