Tamilisai: KCR స్టాలిన్‌లాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారు

తెలంగాణ సీఎం KCR కూడా తమిళనాడు సీఎం స్టాలిన్‌లానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తీవ్ర వ్యాఖ్యలు చేసారు తెలంగాణ‌ గవర్నర్ తమిళిసై (tamilisai). KCR తీరు త‌న‌ను ఎంతో బాధించింద‌ని, తాను త‌మిళ‌నాడులో ఉన్న‌ప్పుడు త‌న చాయ్ విందుకు స్టాలిన్ (mk stalin) రాలేదని ఇప్పుడు KCR కూడా రాలేద‌ని అన్నారు. KCR త‌న ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించడం ఇది మూడోసార‌ని త‌మిళిసై విమ‌ర్శించారు. ఆగస్ట్ 15న “ఎట్ హోం” కార్యక్రమానికి ప్రతిసారి ప్రతిపక్ష నేతలు హాజరయ్యే వారు. ఈసారి వాళ్ళు కుడా హాజరు కాలేదు. దాంతో రాజ్ భవన్లో (raj bhavan) హడావుడి లేకుండా పోయింది. ఈ కార్యక్రమానికి BJP నేతలు కుడా హాజరు కాకపోవడంతో చర్చకు దారితీసింది.