Gajwel: సిద్ధారామ‌య్య‌కు క‌లిసొచ్చింది.. మ‌రి కేసీఆర్‌కి?

Telangana Elections: ఈరోజుతో తెలంగాణ‌లో అన్ని పార్టీల ప్ర‌చార కార్యక్ర‌మాలు ముగిసాయి. బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధులు అధికారంలోకి వ‌స్తే తాము ఏం చేస్తామో క్లుప్తంగా వివ‌రించారు. ఇక తీర్పు ప్ర‌జ‌ల చేతుల్లో ఉంది. అయితే.. తెలంగాణ సీఎం KCR చివ‌రి ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని గ‌జ్వేల్‌లో (gajwel) నిర్వ‌హించారు. గ‌జ్వేల్ నుంచి KCR రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సీటుకి VIP స్టేట‌స్ ఉంది. ఎందుకంటే సీఎం నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి.

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేసేసి చివ‌రిగా గ‌జ్వేల్‌లో ప్ర‌చార స‌భ‌ను నిర్వ‌హించ‌డంపై అక్క‌డి ప్ర‌జ‌ల్లో కాస్త అసంతృప్తి క‌నిపిస్తోంది. ఎక్క‌డైనా ముందు గెలిపించిన సీటు నుంచి మొద‌లుపెట్టాలి కానీ చివ‌రి ప్ర‌సంగ నియోజ‌క‌వ‌ర్గంగా ఎంచుకున్నందుకు చిన్న‌బుచ్చుకున్న‌ట్లు తెలుస్తోంది. అయినా ఏం ఫ‌ర్వాలేదు. ఎందుకంటే KCR ఎప్పుడు ఎలా వ‌చ్చినా గ‌జ్వేల్ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి డెవ‌ల‌ప్ చేస్తార‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల‌కు బ‌లంగా ఉంది.

ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక సీఎం అభ్య‌ర్ధి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చివ‌రి ప్ర‌సంగాన్ని ఏర్పాటుచేయ‌డం ఇది మొద‌టిసారి కాదు. మొన్న జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో (karnataka elections) సీఎం అభ్య‌ర్ధి అయిన సిద్ధారామ‌య్య (siddaramaiah) కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన వ‌రుణ‌కు (varuna) చివ‌రి ప్ర‌సంగాన్ని ఇవ్వ‌డానికి వెళ్లారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ విజ‌య భేరి మోగించింది. మ‌ళ్లీ సిద్ధారామ‌య్య సీఎం అయ్యారు. మ‌రి ఇప్పుడు ఈ సెంటిమెంట్ KCRకు కూడా క‌లిసొస్తుందా అనేది ప్ర‌శ్న‌. (gajwel)

ఈ విష‌యంలో రాజ‌కీయ విశ్లేష‌కుడు అయిన గాలి నాగ‌రాజ (gali nagaraju) స్పందిస్తూ.. గ‌జ్వేల్‌లో ఈసారి KCRకు మూడు స‌మ‌స్య‌లు ఎదురు కాబోతున్నాయ‌ని తెలిపారు. అవేంటంటే.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్ట్ స‌మ‌యంలో రైతుల త‌మ స్థ‌లాలు, ఇళ్లు కోల్పోయి నిర్వాసితులు అయ్యారు. పేరుకి సీఎం నియోజ‌క‌వ‌ర్గం అనే కానీ ఆయ‌న అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ అందుబాటులో లేరు. ఏద‌న్నా ఉంటే స్థానిక BRS పార్టీ నేత‌లు స‌మ‌స్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లే ప‌రిస్థితి. ఇక మూడోది.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి BRS పార్టీ నుంచి BJPలో చేరిన ఈటెల రాజేంద‌ర్ (etela rajender) పోటీ చేస్తుండ‌డం. వీటిని ఎదుర్కొనే సామ‌ర్ధ్యం KCRకు ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డో కాస్త అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.