BRS: KTR మాట వినుంటే గెలిచేవారే..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి BRS పార్టీ ఓటమిని రుచిచూసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామనుకున్న BRS మరీ ఒకవంతు ఓట్లతో గెలవడంతో పార్టీ నేతలు షాకయ్యారు. ఇందుకు ప్రధాన కారణం మాజీ సీఎం KCR.. తన కుమారుడు KTR మాట వినకపోవడమే. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందిని మార్చాలని.. కొత్తవారికి టికెట్లు ఇస్తే మళ్లీ గెలిచే అవకాశం ఉందని ముందు నుంచీ KCRకు KTR చెప్తూ వస్తున్నారు. కానీ KCR.. కనీసం సగం మందిని కూడా కాకుండా కేవలం పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రమే పక్కనపెట్టారు.
ఇది BRS పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే దాదాపు 30 ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉందని.. ప్రజల్లో వారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని KTR హెచ్చరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వేరే వారికి ఇస్తే వారు పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తారన్న భయంతో ఉన్నవారికే టికెట్లు కేటాయించారు. ఆ ఎఫెక్ట్‌తోనే పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఆ 39 కూడా దాదాపు గ్రేటర్ హైదరాబాద్ నుంచి పడినవే. ఎందుకంటే హైదరాబాద్‌ను KTR ఎలా డెవలప్ చేసారో ప్రజల కళ్లముందే కనపడుతోంది.
బెంగళూరును దాటి ఇప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఎదుగుతోంది అంటే అందుకు కేటీఆరే కారణం. దాంతో హైదరాబాద్ మొత్తం BRS పార్టీకే జై కొట్టింది. BRS ఓట్లు కోల్పోయింది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే. మళ్లీ ఎన్నికల్లో BRS పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు గ్రామీణ ప్రజలను తన వైపునకు తిప్పుకోవాలి.