KCR in Gajwel: నెల‌కోసారి గ‌జ్వేల్‌కి వ‌స్తా.. కావాల్సింది చేసిపెడ‌తా

Telangana elections: తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం KCR త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్‌లో (kcr in gajwel) ప్రచార కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటుచేసారు. ఎన్నిక‌ల‌య్యాక నెల‌కోసారి వ‌చ్చి గ‌జ్వేల్‌లో ఉంటాన‌ని.. ప్ర‌జ‌లు ఏం కావాల‌న్నా చేసిపెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికీ త‌న‌కు ఉన్న ఒకే ఒక్క బాధ పేరుకి గ‌జ్వేల్ ఎమ్మెల్యే అనే కానీ ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మాత్రం క‌నిపించ‌లేక‌పోతున్నాను అని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ ప్ర‌జ‌లు త‌న‌ను క‌డుపులో పెట్టుకుని గెలిపించార‌ని అన్నారు. గ‌జ్వేల్‌కు ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌ని తెలిపారు. గ‌జ్వేల్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న 3 నియోజ‌క‌వ‌ర్గాలు కూడా గెల‌వాల‌ని KCR పిలుపునిచ్చారు. ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వ‌స్తాన‌ని తెలిపారు.