KCR: తెలంగాణను లత్కోర్‌లు ఏలుతున్నారు
KCR: ఈరోజు తెలంగాణలో ఎండని పంట లేదని అన్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్‌లోని సిరిసిల్ల ప్రాంతంలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. ఈరోజు రైతులు ఎండిపోయిన పంటలను చూసి ఏడుస్తున్నారంటే అందుకు కారణం తెలంగాణలో లత్కోర్‌లు పనికిమాలిన వాళ్లు రాష్ట్రాన్ని ఏలుతుండడమని కామెంట్స్ చేసారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరుగుతోందని.. పంట వేసి పెట్టుబడి పెట్టినా కూడా వారికి పంట చేతికి రాకపోవడం బాధాకరం అని అన్నారు. పాదయాత్రలో భాగంగా రైతులు తన వద్దకు వచ్చి ఏడ్చి మొత్తుకుంటున్నారని ఇప్పటివరకు రైతుబంధు కూడా రాలేదని వాపోయారని కేసీఆర్ అన్నారు.
చనిపోయిన రైతులకు వెంటనే రూ.25 లక్షల వరకు పరిహారం చెల్లించాలని లేదంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల వరకు పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. తప్పించుకోవాలనుకుంటే ప్రజలు వీపులు విమానం మోగిస్తారని పంచ్‌లు వేస్తారు. పరిస్థితులను గమనించేందుకే తాను నాలుగు నెలలుగా సైలెంట్‌గా ఉన్నానని అన్నారు.
“” రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ఓ మాట అంటున్నారు. నీళ్లు లేవు అని ముందే చెప్తే విడుదల చేసేవాళ్లం కదా అని. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నేనా నువ్వా? ఏం చేస్తున్నారు మీ ఇంజినీర్లు, అధికారులు? నేను ఈరోజు కరీంనగర్ వెళ్తున్నానని తెలిసి కూలిపోయింది అని వాదిస్తున్న కాళేశ్వరం నీళ్లనే రిలీజ్ చేసారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షభం వచ్చేలా ఉంది. రుణ మాఫీ ఎప్పుడు చేస్తారు? బ్యాంకుల నుంచి నోటీసులు వస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇవన్నీ తేలే వరకు వదిలిపెట్టం “” అన్నారు