BRS Candidate List: 7 మార్పులే..!

తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోయే అభ్య‌ర్ధుల లిస్ట్‌ను (brs candidate list) సీఎం KCR రిలీజ్ చేసారు. ఈరోజు పంచ‌మి, శ్రావణ సోమ‌వారం కావ‌డంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో (pragati bhavan) KCR అభ్య‌ర్ధుల జాబితాను రిలీజ్ చేసారు. టికెట్ ద‌క్క‌నివారికి ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో అవకాశాలు క‌ల్పిస్తామ‌ని KCR హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పెద్ద‌గా మార్పులేమీ చేయ‌లేద‌ని, 7 మార్పులు మాత్ర‌మే చేసామ‌ని KCR అన్నారు. వేముల‌వాడ‌, ఉప్ప‌ల్, మెట్‌ప‌ల్లి, బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌లో మార్పులు చేసిన‌ట్లు KCR ప్ర‌క‌టించారు.

“” టికెట్లు రాని వారు చిన్న బుచ్చుకుని భ‌విష్య‌త్తును పాడుచేసుకోవ‌చ్చు. చాలా అవ‌కాశాలు ఉంటాయి. పార్టీలోనే ఉండి మిగ‌తా వారిని గెలిపించే బాధ్య‌త‌ను తీసుకుంటారని ఆశిస్తున్నాను. మన‌లో మ‌నం కొట్టుకోవ‌ద్దు. యుద్ధాలు వేరే చోట చేయాల్సి ఉంటుంది. పార్టీ ఘ‌న విజ‌యం సాధించి తెలంగాణ‌ను మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకువెళ్లాల‌ని కోరుకుంటున్నాను “” అని తెలిపారు. (BRS Candidate List)