Kavitha Arrest: ఈరోజు రాత్రంతా ఈడీ ఆఫీస్‌లోనే కవిత
Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) భాగంగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో కవితను రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. రేపు ఉదయం వైద్య పరీక్షలు చేయించి లంచ్ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే రాత్రి మరో ఫ్లైట్‌లో KTR, హరీష్ రావు (Harish Rao) కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.