Kavitha: నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టచ్చు.. అప్రూవర్‌గా మారేది లేదు
Kavitha: ఈ కేసు నుంచి నేను కడిగిన ముత్యంలో బయటికి వస్తా అని అన్నారు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం ఈడీ రిమాండ్‌లో ఢిల్లీలో ఉన్న కవితను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. “” ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. నన్ను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఇంకో నిందితుడు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు రూ. 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చాడు. నేను క్లీన్‌గా బయటకు వస్తా. అప్రూవర్‌గా మారేది లేదు “” అని వెల్లడించారు.