ED Notice: KCRతో కవిత భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquir scam) భాగంగా మరోసారి BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ నోటీసులు (ed notice) అందాయి. ఈ నేపథ్యంలో కవిత.. తెలంగాణ సీఎం KCRతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈడీ నోటీసులను తెలంగాణ ప్రజలు కానీ పార్టీ కేడర్ కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన నోటీసులు ఇస్తూనే ఉంటుందని కవిత తెలిపారు. నోటీసుల నేపథ్యంలో ఈరోజు కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఈరోజు ఆమె వెళ్లడంలేదు. ఈ నోటీసుల విషయంలో తన లాయర్లను సంప్రదించి వారు చెప్పినట్లుగా నడుచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. నిన్నటి వరకు నిజామాబాద్లో ఉన్న కవిత నోటీసులు అందగానే ఢిల్లీకి కాకుండా నేరుగా హైదరాబాద్లో ఉన్న తన నివాసానికి వెళ్లిపోయారు. సాయంత్రం లోగా KCRను కలిసి ఈ విషయం గురించి చర్చించనున్నారు. (ed notice)