Kavitha: వీటికి జవాబులిచ్చి తెలంగాణలో అడుగుపెట్టండి
త్వరలో తెలంగాణలో CWC జరగనున్న సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత.. (kavitha) కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో అడుగుపెట్టే ముందుకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అప్పుడు సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన హామీలను ఇతర రాష్ట్రాల్లో ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ మరే రాష్ట్రంలోనూ ఇవ్వడంలేదని. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కలలో అయినా ఊహించగలరా అని అడిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లులు, రైతుల రుణమాఫీ బిల్లులపై స్పందించి అప్పుడు తెలంగాణలో అడుగుపెట్టాలని అన్నారు.