Kavitha: 6 నెల‌ల పాటు జైల్లోనే?

Kavitha: ఢిల్లీ లిక్కర్ పాల‌సీ స్కాంలో (Delhi Liquor Policy Scam) అరెస్ట్ అయిన భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విష‌యంలో ఓ కీల‌క అప్డేట్ వైర‌ల్ అవుతోంది. క‌విత పెట్టుకున్న మ‌ధ్యంత‌ర బెయిల్‌ను ఈరోజు సీబీఐ కోర్టు నిరాక‌రించింది. రేపు క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ కూడా ముగియ‌నుంది. అయితే క‌విత దాదాపు 6 నెల‌ల పాటు జైల్లోనే ఉండాల్సి వ‌స్తుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఈ స్కాంలో అర‌వింద్ హ‌స్తం కూడా ఉంద‌ని తేలే వ‌ర‌కు క‌విత జైల్లోనే ఉండాల్సి వ‌స్తుంద‌ట‌. ఈ కేసులో అరెస్ట్ అయి శిక్ష అనుభ‌వించిన ఆప్ నేత సంజ‌య్ సింగ్ ఇటీవ‌ల బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. దాంతో త‌న‌కు కూడా బెయిల్ వ‌స్తుంద‌ని క‌విత ఆశించారు కానీ కోర్టు అందుకు అంగీక‌రించ‌లేదు. మ‌రోప‌క్క క‌విత‌ను ఎలాగైనా బెయిల్‌పై విడిపించి తీసుకురావాల‌ని ఆమె అన్న కేటీఆర్, తండ్రి కేసీఆర్ ఎంతో ప్ర‌య‌త్నిస్తున్నారు.