Kavitha: చంద్రబాబు కుటుంబం ఎంతో ఆవేదన చెందుతోంది
Telangana Elections: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) సరదాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.
BJP అధికారంలోకి వస్తే BC అభ్యర్ధిని సీఎం చేస్తామని ప్రకటించింది. అదే జరిగితే BCలకు మంచి జరిగే అవకాశం ఉంటుందా?
BJP రాష్ట్ర అధ్యక్షుడిగా BC అభ్యర్ధి ఉంటే అతన్ని తీసేసి ఇప్పుడు OC అభ్యర్ధిని నియమించింది. అసలు BJPకి OBC జన గణన (caste census) చేయాలన్న ఉద్దేశమే లేదు. మహిళలకు రిజర్వేషన్ కూడా ఇవ్వరు. కేంద్రంలో అభివృద్ధి సంఘాన్ని కూడా పెట్టాలనుకోవడంలేదు. అలాంటి BJP ఇప్పుడు BC అభ్యర్ధిని సీఎం చేస్తామంటే తెలంగాణ ప్రజలకు నమ్మేంత పిచ్చి వారు కాదు. (kavitha)
ఈసారి BRS గెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా?
తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగినవారు. వారికి తెలుసు రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేసారో. వారి ఆశీర్వాదంతోనే 95 నుంచి 105 సీట్లు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాకుంది.
KTR అన్నతో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోండి మేడమ్
బాధ్యత కలిగిన సోదరుడు. చిన్నప్పటి నుంచి తనతో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఒక్కటి చెప్పడం కష్టం. కరెక్టేనా అన్నయ్యా.. (అంటూ KTRని ట్యాగ్ చేసారు.)
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయ్యింది. మీ అభిప్రాయం ఏంటి?
పిల్లి వంద ఎలుకల్ని తిని హజ్ యాత్రకు వెళ్లిందట. అట్లుంది వారి తీరు.
చాలా సర్వేలు ఈసారి BRS కాంగ్రెస్, సంకీర్ణం ఏర్పడుతుందని అంటున్నారు. కరెక్టేనా మేడమ్?
2018లో కూడా వారు ఇదే గిమ్మిక్ చేసారు. కానీ BRS భారీ మెజార్టీతో గెలిచింది. ఈసారి కూడా కాంగ్రెస్ ఇలాంటి సర్వేలే చేస్తది.. మళ్లీ BRS ప్రభుత్వమే వస్తది.
మీకు స్ఫూర్తి ఎవరు అక్కా?
నాన్న
చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటీ?
ఈ వయసులో చంద్రబాబు నాయుడు జైలు శిక్ష అనుభవించడం అనేది దురదృష్టకరం. కుటుంబం ఎంత ఆవేదన చెందుతోందో నాకు అర్థమవుతోంది. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
రాహుల్ గాంధీ KCRను రాజుగా పాలిస్తున్నాడని అన్నారు. జీవన్ రెడ్డి మిమ్మల్ని లిక్కర్ క్వీన్ అన్నారు. దీనిపై మీ కామెంట్స్?
నేను రాజకీయంలో పాన్ (తాకట్టు)గా ఉండే కంటే క్వీన్‌గా ఉండటానికే ఇష్టపడతాను. ఎన్నైనా అనుకోనివ్వండి. (kavitha)
యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
మీరే ఈ దేశానికి ఆదర్శం. మీరు రాజకీయాల్లోకి రావాలి. ఇక్కడే నిలబడాలి. రాజకీయాలు పార్ట్ టైం జాబ్ కాదు.
అక్కా రాహుల్, ప్రియాంక మళ్లీ తెలంగాణ వస్తారట
రానివ్వండి. వారికి ఎన్నికల సమయంలోనే కదా తెలంగాణ గుర్తొచ్చేది. వస్తరు.. ఒక పేపర్ చదువుతరు.. పోతరు.
ఎవరితో సాధ్యం కాని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కారణజన్ముడు KCR గారికి కూతురుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అక్క?
అంతటి గొప్ప మనిషికి కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రపంచంలోనే నేను ఎంతో అదృష్టవంతురాలిని.
అపోజిషన్ పార్టీలు మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయ్ అక్కా?
నేను వారికి స్ట్రాంగ్ ప్రత్యర్ధిని కదా..
BRS పథకాలు కాపీ చేసి, పై నుంచి మీరే మా పథకాలు కాపీ చెసిర్రు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నరు.. దాని పై మీ కామెంట్ అక్క??
నకల్ మార్నే కోభీ అకల్ రెహ్నా బొల్తే! (కాపీ కొట్టడానికి కూడా మైండ్ ఉండాలి అంటా)
మీకు BJPకి డీల్ ఏంటి?
డీల్ ఏమీ లేదు. మేం ప్రత్యర్ధులం అంతే. (kavitha)
కవిత గారూ.. ఈసారి మీకు ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు?
సెంచరీ పక్కా. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం.
తెలంగాణలో మీకు నచ్చిన ప్రదేశం ఏది?
కుంతల జలపాతం
మీ నాన్న కాకుండా ఏ పొలిటిషియన్ అంటే ఇష్టం?
మమతా దీదీ.
మీరు ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నారు? మీ నాన్న నుంచా? అన్న నుంచా? (ఈ ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ కవితను అడిగింది)
కాంగ్రెస్‌పై నిజాయతీగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకున్నాం. ఎన్నికలు ఉన్నా లేకపోయినా BRS పార్టీ నిజాన్నే నమ్ముకుంది. మీ పార్టీలా కాదు.
చిరంజీవి గురించి మీ అభిప్రాయం?
డై హార్డ్ ఫ్యాన్. ఆయన తర్వాత నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. తగ్గేదేలే..!