Kavitha పక్షాన నిలిచిన సుప్రీంకోర్టు

Hyderabad: ఈడిపై ఎమ్మెల్సీ కవిత (kavitha) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (supreme court) పరిగణన‌లోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడి (ed) కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. లిక్క‌ర్ స్కాంలో (delhi liquor scam) భాగంగా ఈడీ ప‌లుమార్లు క‌విత‌ను దిల్లీలోని త‌మ కార్యాల‌యానికి పిలిపించి విచార‌ణ చేప‌ట్టింది. ఓ మ‌హిళను ఈడీ అలా కార్యాల‌యానికి పిలిపించుకుని ఎలా విచారిస్తారు అని క‌విత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. కవిత పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి త‌మ వాద‌న‌లు వినిపించారు.