Karumuri Nageshwar Rao: పవన్ ఆ పని చేస్తే ఉరేసుకుంటా
AP: YSRCP మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageshwar rao) జనసేనాని పవన్ కళ్యాణ్‌పై (pawan kalyan) సవాల్ విసిరారు. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థపై (ap volunteers) ఆరోపణలు చేస్తున్న పవన్.. ఒక్క వాలంటీర్‌ను అరెస్ట్ చేయించగలిగినా తన నియోజకవర్గంలోని నరేంద్ర సెంటర్‌లో ఉరేసుకుంటానని అంటున్నారు. ఆ దమ్ము పవన్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు. కొందరు వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం వల్లే ఏపీలో ఏకంగా 18 వేల మంది అమ్మాయిలు కనిపించకుండాపోయారని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలు రుజువు చేస్తూ ఒక్క వాలంటీర్లు జైలుకి పంపినా ఉరేసుకుంటానని నాగేశ్వరరావు (karumuri nageshwar rao) అన్నారు.