karnataka: BJP సెంటిమెంట్ రాజకీయాలు
bengaluru: కర్నాటక ఎన్నికల్లో(karnataka elections) గెలుపే లక్ష్యంగా బీజేపీ(bjp) అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్(congress), జేడీఎస్(jds) నాయకులు మాట్లాడే కాంట్రవర్సీ మాటలను ఆయుధంగా మార్చుకుని సెంటిమెంట్ రాజకీయాల(sentiment politics)కు తెరలేపుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే(congress president mallikarjun kharge) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన బీజేపీని ఉద్దేశిస్తూ.. ఆ పార్టీ నాయకత్వాన్ని విషసర్పంతో పోల్చారు. దేశానికి ఎంతో ప్రమాదమని చెప్పారు. దీన్ని బీజేపీ ఆయుధంగా మలుచుకుని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఖర్గే వ్యాఖ్యలు మోదీని(pm modi) ఉద్దేశించి చేశారని.. బీజేపీ ఆరోపించడమే కాకుండా.. ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళుతోంది. మోదీ ఇమేజ్, సెంటిమెంట్‌ను ప్రజల్లో రగిలించి.. ఓట్లు పొందాలని చూస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలి నుంచి.. బీజేపీ కర్నాటకలో చేసిన అవినీతి కార్యక్రమాలు, 40 శాతం కమీషన్ తీసుకోవడం, రాష్ట్రంలోని సమస్యలు తదితర అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఈ తరుణంలో ఖర్గే వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా మారాయి. వాస్తవానికి మోదీ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో ఉంటుంది. కానీ ఖర్గే మాటలతో దాన్ని మోదీ వైపుకి బీజేపీ నాయకులు తిప్పి.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెంటిమెంట్‌ని జోడించి గెలుపొందాలని చూస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ.. మోదీ ఇంటిపేరు ఉన్న వారందరూ దొంగలే అని మాట్లాడటం ఎంతపెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా గతంలో గుజరాత్ ఎన్నికల్లో కూడా ఖర్గే.. మోదీని రావణాసుడితో పోల్చి వివాదాస్పదం అయ్యారు. ఇలా బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలు చేస్తుండటం వల్ల బీజేపీ నాయకత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోంది. ఇక కర్నాటకలో కూడా ఇదే అనుసరిస్తోంది.