Karnataka: మంత్రుల‌కు 33 ఇన్నోవా కార్లు.. ధ‌రెంతో తెలుసా?

క‌ర్ణాట‌క కేబినెట్ మంత్రుల (karnataka) కోసం ప్ర‌భుత్వం ఏకంగా 33 ఇన్నోవా (innova) కార్లు కొనుగోలు చేయ‌నుంది. రూ.9.9 కోట్ల విలువైన 33 ఇన్నోవా హైక్రాస్ టాప్ ట్రిమ్ కార్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఇన్నోవా హైక్రాస్ టాప్ ట్రిమ్ కారు ఆన్ రోడ్డు ధ‌ర రూ.33 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది. ఇందుకోసం సంప్ర‌దాయంగా జ‌రిగే టెండ‌ర్ విధానంలో కాకుండా నేరుగా కొనుగోలు చేసేందుకు KTPP (క‌ర్ణాట‌క ట్రాన్స్‌ప‌రెన్సీ ఇన్ ప‌బ్లిక్ ప్రొక్యూర్‌మెంట్) యాక్ట్ కింద 4(G)ని మిన‌హాయించారు.

దాంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు అంత ఖ‌ర్చు చేసి కార్లు కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది అంటూ మండిప‌డుతున్నారు. దీనిపై క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ (dk shivakumar) స్పందిస్తూ.. “” మంత్రుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో త‌ప్పేముంది? వాళ్లు కూడా దూర ప్రాంతాలకు ప్ర‌యాణిస్తుంటారు. మాకు మిగ‌తా రాష్ట్రాల్లాగా హెలికాప్ట‌ర్లు, చార్టెడ్ విమానాలు లేవు క‌దా..? నేను ఈ రోజు ఉద‌యం కూడా క‌మ‌ర్షియ‌ల్ విమానంలోనే ప్ర‌యాణించాను “” అని తెలిపారు. (karnataka)