karnataka elections: బరిలో నిలిచే BJP అభ్యర్థులు వీరే

Banglore: కర్నాటక అసెంబ్లీ(karnataka elections) ఎన్నికల్లో బీజేపీ(BJP) తరపున పోటీ చేసే తొలి జాబితా విడుదల చేశారు. దాదాపు వారం పాటు అభ్యర్థుల ఎంపికపై కర్నాటక సీఎం బొమ్మై(cm bommai), బీజేపీ సీనియర్‌ నాయకుడు యడుయూరప్ప(yaduyurappa), ఇతర రాష్ట్ర నేతలు, కేంద్ర పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత తొలి జాబితాను 189 మంది సభ్యులతో ప్రకటించారు(karnataka elections). పలుమార్లు వడపోతలు, సర్వేలు.. ఊరింపులు, బెదిరింపులు.. అలకలు.. బుజ్జగింపులతో ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అందరికంటే ఆలస్యం చేస్తూ వస్తోంది. ఇక సమయం దగ్గర పడుతుండటంతో తొలి జాబితాను ప్రకటించింది.

బీజేపీ(bjp) కర్ణాటక ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌(Arun singh) మంగళవారం రాత్రి మొదటి జాబితా(first list released)ను విడుదల చేశారు. ఇందులో ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చామని తెలిపారు. 8 మంది మహిళలకు చోటు దక్కిందన్నారు. 189 టికెట్లలో 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు ఇచ్చినట్లు తెలిపారు. వరుణలో సిద్దూతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మంత్రులిద్దరూ వేరే స్థానాల్లోనూ పోటీచేస్తారు. ఇక సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో , గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. ఇక ఉడుపి నియోజకవర్గంలో యశ్‌పాల్‌ సువర్ణకు అవకాశమిచ్చారు.