BJP విషసర్పంతో సమానం అన్న ఖర్గే.. సీఎం ఫైర్‌!

bengaluru: కర్నాటకలో స్టార్‌ క్యాంపెయిన్‌ మొదలైంది. సీఎం బసవరాజు బొమ్మై(cm bommai)కు మద్దతుగా సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌(kicha sudeep) ప్రచారం(campaign) చేస్తున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు, నాయకులు కర్నాటకలోని అనేక నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు సైతం స్పీడ్‌ పెంచారు. ఈక్రమంలో ఇరు పార్టీల నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(kharge).. బీజేపీ(bjp)ని ఉద్దేశించి.. ఆ పార్టీని విషసర్పంతో పోల్చారు. దీనిపై సీఎం బొమ్మ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌(congress) నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ , బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బొమ్మై ఆరోపించారు. కర్నాటక ప్రజలు ఓట్లతో కాంగ్రెస్‌కు బుద్ది చెబుతారని కౌంటర్‌ ఇచ్చారు. మరోవైపు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికి కాంగ్రెస్‌ ఘనవిజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌(dk siva kumar) అన్నారు.

ఇక ఖర్గే వ్యాఖలను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. అయితే దీనిపై స్పందించిన ఆయన.. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. బీజేపీ సిద్దాంతాలు విషసర్పంతో సమానమని తాను చేసిన వ్యాఖ్యలకు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని 75 శాతానికి పెంచుతామని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.