BJP కొత్త ప్లాన్.. లింగాయత్‌లను ఆకర్షిస్తుందా?
bengaluru: కర్నాటక ఎన్నికల్లో(karnataka elections) బీజేపీ(bjp) అనేక ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 74 మంది కొత్తవారికి సీట్లు కేటాయించి సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీలోని కీలక నేతలు.. కాంగ్రెస్(congress)లో చేరుతున్నారు. ఇక 40 ఏళ్లకు పైగా బీజేపీకి కర్నాటకలో సేవలందించిన మాజీ సీఎం జగదీశ్ షెట్టార్(jagdesh shettar), ఇతనితోపాటు.. డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవ్వాది కాంగ్రెస్‌లో చేరారు. విశేషమేమిటంటే ఇద్దరూ లింగాయత్(lingayats) సామాజిక వర్గానికి చెందిన వారే.. ఇక బీజేపీ ఆశలన్నీ లింగాయత్ ఓటర్లపైనే పెట్టుకున్న తరుణంలో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం నష్టమనే చెప్పాలి.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. లింగాయత్‌లకు బీజేపీ సముచిత స్థానం కల్పించడం లేదని.. అవమానిస్తోందని చెబుతోంది. ఇక లింగాయత్ ఐకాన్‌గా పిలిచే యడుయూరప్ప(yediyurappa)ను కూడా సీఎం పదవి నుంచి తప్పించిందని, ఇది లింగాయత్‌లను అవమానించడం కాదా అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇది బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. 1990లో కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అప్పటి సీఎంగా ఉన్న వీరేంద్ర పాటిల్(veerendhra patil)ను అనారోగ్య సమస్యల వల్ల పదవి నుంచి తొలగించింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న బీజేపీ అప్పట్లో లింగాయత్‌లను రాజీవ్ గాంధీ(rajiv gandhi), కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రచారం చేసింది. ఇందులో చాలా వరకు బీజేపీ సఫలీకృతం అయ్యి.. లింగాయత్‌లను తమవైపు తిప్పుకుంది. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఇదే రాజకీయ అస్త్రాన్ని కాంగ్రెస్ వాడుతోంది. బీజేపీ మాత్రం తమ పార్టీ అధికారంలో వచ్చిన నాలుగు సార్లలో మూడు సార్లు సీఎంలుగా లింగాయత్‌లే ఉన్నారని కౌంటర్ ఇస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. కన్నడ జనాభాలో 17 శాతం వరకు ఉండే లింగాయత్‌లు రాజకీయాలను శాసించగలరు. సమాజంపై కూడా వీరి ప్రభావం ఉంటుంది. ఇక కాంగ్రెస్ అస్త్రం ఫలిస్తుందా.. లేకా హిందుత్వం సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి లింగాయత్‌లు బీజేపీ వెంట ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.