karnataka elections: ఎమ్మెల్యే అభ్యర్థిగా బిచ్చగాడు!
bengalurur: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(karnataka elections)కు సంబంధించి నామినేషన్ల(nominations) పర్వం గురువారంతో పూర్తయ్యింది. మొత్తం స్థానాలు 224 ఉండగా.. అందులో 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,102 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఈక్రమంలో ఆ రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు(beggar) స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. గురువారం నామపత్రం సమర్పించిన ఆయన.. అందుకోసం భిక్షాటనతో పోగు చేసిన రూ.10 వేలను డిపాజిట్‌గా చెల్లించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే…. కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్ ను ఏప్రిల్ 13న ప్రకటించగా.. అప్పటి నుంచి.. నామినేషన్ డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గం(yadagiri constituency)లో తిరుగుతూ యాచించినట్లు యంకప్ప చెబుతున్నారు. అలా సేకరించిన చిల్లరను గురువారం ఎన్నికల అధికారికి ఇచ్చారు. దాదాపు 2 గంటలపాటు శ్రమించి అధికారులు ఆ చిల్లరంతా లెక్కించారు. అనంతరం నామినేషన్ స్వీకరించినట్లు అధికారి తెలిపారు. పగలు భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకునే యంకప్ప.. రాత్రి వివిధ ఆలయాల్లో నిద్రిస్తాడు. అలాంటిది ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావ్ అని పలువురు ప్రశ్నించగా.. తాను ఎందుకు పోటీ చేస్తున్నానో నియోజకవర్గ ప్రజలకు వివరించి… వారి నుంచే డిపాజిట్ డబ్బును సేకరించినట్లు చెబుతున్నాడు. మరి యంకప్పకు ప్రజలు ఎన్ని ఓట్లు వేస్తారో అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.