Karnataka Elections: భారీ బందోబస్తు మధ్య పోలింగ్
Bengaluru: కర్నాటక(karnataka elections) రాష్ట్రంలో భారీ బందోబస్తు నడుమ బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Karnataka Assembly polling begins) ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. బరిలో 224 అసెంబ్లీ స్థానాలకు 2,615 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ పార్టీల మధ్యే పోటీ నెలకొంది. దీంతోపాటు… కర్నాటక (Karnataka Assembly polls) రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్ లు, 11 శాతం ఉన్న వొక్కలిగాస్ ఓటర్లు ఎప్పటిలాగే.. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు ఈ నెల 13వ తేదీన వెల్లడి కానున్నాయి.
మరోవైపు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) బుధవారం బెంగళూరులో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మనం మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి… కర్నాటక ఉజ్వలంగా ఉండాలి’’(Vote against communal politics) అని నటుడు ప్రకాష్ అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్(Union Finance Minister and BJP leader Nirmala Sitharaman) బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన వీడియోను ట్వీట్ చేశారు. వీరితోపాటు మాజీ సీఎం యడుయూరప్ప కుటుంబ సమేతంగా ఓటు వేసేందుకు వచ్చారు. ఇక పోలింగ్ వేళ.. హెంమంత్రి అమిత్షా, ప్రధాని మోదీ.. కర్నాటక ప్రజలు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.