Karnataka CM: 48-72 గంటల్లో ప్రకటన.. తగ్గేదేలేదన్న డీకే?
Delhi: మరో 48 నుంచి 72 గంటల్లో కర్ణాటక ముఖ్యమంత్రిని(karnataka cm) ప్రకటిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా(randeep singh surjewala) తెలిపారు. సిద్ధారామయ్యే(siddaramaiah) 100% సీఎం అవుతారని ఇప్పటికే స్పష్టం అయింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ(rahul gandhi).. సిద్ధరామయ్యతో, డీకే శివకుమార్‌తో(dk shivakumar) చర్చలు జరిపాక.. సిద్ధూనే సీఎం చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే దీని గురించి శివకుమార్‌తో (shivakumar)చర్చిస్తే.. ఈ విషయంలో తగ్గేదేలేదని అన్నట్లు తెలుస్తోంది. తనను అయితే సీఎం చేయాలని లేదా ఎమ్మెల్యేగానే కొనసాగుతానని అన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయితే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు(loksabha elections) అయ్యే వరకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పాత్రలో కొనసాగాలని, ఎన్నికల తర్వాత మంచి పొజిషన్ ఇస్తానని రాహుల్ ఆయన్ని బుజ్జగించినట్లు తెలుస్తోంది.