UP encounter: నా అన్నలా ఎవరూ ఉండరు!
Mumbai: సినిమాలు, రాజకీయం.. విషయం ఏదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం బాలీవుడ్(Bollywood) బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) స్పెషల్. అందుకే కంగన బాలీవుడ్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక, తాజాగా కంగనా ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అసద్ అహ్మద్(Asad Ahmed) ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.
గురువారం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఎన్కౌంటర్లపై మాట్లాడుతూ చేసిన ‘మిట్టీ మే మిలా దూంగా’ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ట్విట్టర్ వేదికగా నటి కంగనా కూడా యోగి ఆదిత్యానాథ్‌ని ప్రశంసించారు. ‘నా అన్నలా ఎవరూ ఉండరు’ అంటూ ట్వీట్ చేశారు.
2005లో BSP ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్‌ని నిర్భయంగా హత్య చేయడంపై విరుచుకుపడిన ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 25న సమాజ్‌వాదీ పార్టీ మాఫియాలను పెంచి పోషిస్తోందని ఆరోపించి, వాటిని నాశనం చేస్తానని శపథం చేశారు. ‘ఎస్పీ పెంచి పోషించిన మాఫియా వాళ్ల వెన్ను విరిచేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ‘మిట్టీ మే మిలా దూంగా’ అంటూ ఆ వీడియోలో ఆదిత్యనాథ్ అన్నారు.
గురువారం, ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్ గురించి పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తూ ఆదిత్యనాథ్ ప్రకటనను ట్యాగ్ చేశారు. దాదాపు 60 వేల మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి ట్వీట్లు చేశారు. “ఎన్‌కౌంటర్”, “అతిక్ అహ్మద్”, “యుపి పోలీస్”, “యుపిఎస్‌టిఎఫ్”, “గుడ్డు ముస్లిం”, “అసద్ అహ్మద్” వంటి అనేక ఇతర హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.