Kancharla Chandrasekhar Reddy: నా అల్లుడు అల్లు అర్జున్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
Kancharla Chandrasekhar Reddy: తన అల్లుడు అల్లు అర్జున్‌పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో పర్యటించిన పవన్.. అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు హీరోలు సినిమాల్లో అడవులను సంరక్షిస్తున్నట్లుగా చూపించేవారని.. ఇప్పుడు వారే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అడవులను నాశనం చేస్తున్నట్లు చూపిస్తున్నారని అన్నారు.
దాంతో అంతా ఆయన అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల గురించే అన్నారని కామెంట్స్ చేసారు. ఈ విషయం గురించి చాలా మంది చంద్రశేఖర్ రెడ్డిని కూడా అడిగారట. ఏంటండీ పవన్ అన్నది మీ అల్లుడు గురించేనా ఇలా ఎందుకు మాట్లాడారు అని అడిగారట. ఈ విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు. తన అల్లుడు పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్లా కేవలం యాక్ట్ చేసాడని.. కానీ పవన్ నిజంగానే స్మగ్లింగ్ చేసినట్లు మాట్లాడారని మండిపడ్డారు. నమ్మిన వారి కోసం అల్లు అర్జున్ ఎంత దాకా అయినా వెళ్తారని అన్నారు.