BJP Incharge: KCRపై పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతాం

తెలంగాణ సీఎం KCRకి ఎదురెళ్ళి పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతాం అని కామెంట్స్ చేసారు కామారెడ్డి BJP ఇన్‌చార్జి వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి (bjp incharge). ఆయనపై పోటి చేయడం కన్నా ఇంట్లో కూర్చోవడం బెటర్ అని KCR పైన పోటీ దిగినా ఫ‌లితం ఉండ‌ద‌ని అన్నారు. ఈసారి రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో KCR గ‌జ్వేల్, కామారెడ్డి (kamareddy) నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు నువ్వా నేనా అన్న‌ట్లు ఉండాలి కానీ BRS అంటే మండిప‌డే BJP పార్టీకి చెందిన వ్య‌క్తి ఇలా KCRకి స‌పోర్ట్ చేయ‌డాన్ని చూస్తుంటే..BRS BJPకి బీ టీం అని ఎవ‌రో అన్న మాట నిజ‌మేనేమో అనిపిస్తోంది. (telangana elections)