Kamal Haasan: కోయింబ‌త్తూర్ నుంచి పోటీ?

Chennai: MNM (మ‌క్క‌ల్ నీది మ‌యం) పేరుతో పార్టీ పెట్టి రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చారు క‌మ‌ల్ హాస‌న్ (kamal haasan). 2024 ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయాల‌ని దృఢంగా నిర్ణ‌యించుకున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కోయింబ‌త్తూరు (coimbatore) నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. DMKతో పొత్తు పెట్టుకున్న క‌మ‌ల్ హాస‌న్‌కు కోయింబ‌త్తూరు లోక్ స‌భ సీటు నుంచి పోటీ చేసేందుకు పార్టీ ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌ట‌. 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో BJPతో స‌మానంగా పోటీ ప‌డ్డారు క‌మ‌ల్. కానీ కేవ‌లం 1,728 సీట్లతో ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న గ‌ట్టి ఫైట్ ఇచ్చార‌ని ఈసారి కూడా ఆయ‌న‌కే ఛాన్స్ ఇవ్వాల‌ని DMK నిర్ణియించిన‌ట్లు తెలుస్తోంది.

234 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌ల‌తో క‌మ‌ల్ (kamal haasan) స‌మావేశం కానున్న‌ట్లు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌లు ప‌ట్టించుకోని స‌మ‌స్య‌ల గురించి క‌మ‌ల్ వారితో చ‌ర్చిస్తార‌ట‌. వారి నుంచి సేక‌రించిన ఫీడ్‌బ్యాక్ ద్వారా మేనిఫెస్టోని ప్ర‌క‌టించ‌నున్నారు. కోయింబ‌త్తూరులో క‌మ‌ల్‌కు ఇంత పాపులారిటీ రావ‌డానికి మ‌రో కార‌ణం ఏంటంటే.. కొన్ని నెల‌ల క్రితం డీఎంకే నేత క‌ణిమొళి కార‌ణంగా ష‌ర్మిళ అనే బ‌స్ట్ కండ‌క్ట‌ర్ ఉద్యోగం పోయింది. ఈ విష‌యం తెలిసి క‌మ‌ల్ హాస‌న్ ఆమెకు ఓ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. దాంతో అక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌మ‌ల్‌పై మ‌రింత గౌర‌వం పెరిగింది.