Gampa Govardhan: KCRనే పోటీ చేయ‌మ‌ని అడిగా

Kama reddy: తెలంగాణ సీఎం KCR గారిని కామారెడ్డి పోటీ చేయమని, నేను మీ కింద సామాన్య కార్యకర్త లాగా పనిచేస్తానని అడిగానని అన్నారు కామా రెడ్డి (kama reddy) ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ (gampa govardhan). ప్ర‌తిప‌క్ష పార్టీ నేత  మ‌హ‌మ్మ‌ద్ అలీ ష‌బ్బీర్ గోవ‌ర్ధ‌న్ గురించి త‌ప్పుగా మాట్లాడ‌టంతో ఆయ‌న స‌భ పెట్టి మాట్లాడారు.

“” KCR గారిని కామారెడ్డి నుంచి పోటీ చేయండి స‌ర్ అని అడిగాను. కావాలంటే ఆయ‌న చేతి కింద కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తాన‌ని చెప్పాను. ఎవ్వ‌రూ కూడా ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌ద్దు అన‌రు. కానీ నేను వ‌దులుకోవాల‌ని అనుకున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది కామారెడ్డి అభివృద్ధి. నేను పోటీ చెయ్య‌ను మీరే చేయండి అంటే నువ్వు భ‌య‌ప‌డుతున్నావా అని అన్నారు. గ‌త ప్ర‌భుత్వం కేవ‌లం రూ.600 మాత్రమే పెన్ష‌న్ ఇచ్చింది. కానీ మ‌నం రూ.2000 వ‌ర‌కు ఇస్తున్నాం. రానున్న రోజుల్లో పెన్ష‌న్ డ‌బ్బు పెంచుతాం “” కూడా అని తెలిపారు.