NTR: ఫ్యామిలీ అంటే నేను తారక్ మాత్రమే..!
NTR: తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ (jr ntr) స్పందించలేదు. కళ్యాణ్ రామ్ (kalyan ram) కూడా మీడియా ముందు ఈ విషయం గురించి నోరు మెదపలేదు.
అయితే ఇప్పుడు డెవిల్ (devil) సినిమా ఇంటర్వ్యూ సమయంలో ఏపీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా ఉండబోతున్నాయ్.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని కళ్యాణ్ రామ్‌ని అడగ్గా.. దాదాపు ఐదు సెకన్ల పాటు కళ్యాణ్ రామ్ స్పందించలేదు. ఇక స్పందించకపోతే ఏమనుకుంటారో అని ఏదైనా కూడా కుటుంబంతో కలిసి చర్చించి దానినే మీడియా ముందు చెప్తామని.. కుటుంబం అంటే తాను తారక్ మాత్రమే అని చెప్పి ఊరుకున్నారు.
కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే వారు అసలు తెలుగు దేశం పార్టీకి సపోర్ట్‌గా లేరనే తెలుస్తోంది. ఒకవేళ కుటుంబంలో వారు అలా ఎందుకు చెప్పారు అనే చర్చ వస్తే వీరి సమాధానంలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ తారక్, కళ్యాణ్ రామ్ మాత్రం అస్సలు రాజకీయాల జోలికి కానీ తెలుగు దేశం పార్టీ జోలికి కానీ వెళ్లాలనుకోవడంలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.