Kavitha: స్మృతి ఇరానీ నెలసరి కామెంట్స్.. కవిత మండిపాటు
Kavitha: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో నెలసరి సెలవుల గురించి మాట్లాడిన అంశంపై స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ (smriti irani) ఇలా ఆడవాళ్ల నెలసరి నొప్పుల గురించి మాట్లాడటం బాధాకరం అని అన్నారు. నెలసరి సమయంలో నొప్పి, బాధ ఎలా ఉంటాయో ఆడవారికే తెలుసని ఈ బాధలను చూసి కేవలం జాలిపడితే సరిపోదని అన్నారు. నెలసరి సెలవులు నిరాకరిస్తే ఉద్యోగాలు చేసుకునే ఎందరో మహిళలు ఎంతో బాధను అనుభవించాలని తెలిపారు. ఇలాంటి విషయాలలో సరైన పాలసీలు తీసుకొచ్చి మహిళలను ధైర్యం ఇవ్వాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.