Kavitha: నేను మీ ఇట‌లీ రాణిలా కాదు..నోరు అదుపులో పెట్టుకోండి

కాంగ్రెస్ నేత‌ జీవన్ రెడ్డి (jeevan reddy) నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు BRS ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (kavitha). తన‌ను లిక్క‌ర్ క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలవ‌డం కాద‌ని ఇట‌లీ రాణి (సోనియా గాంధీ) లా వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదని అన్నారు. దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మను అవమానించినా కూడా తాను సంయమనంతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ (rahul gandhi) త‌న‌ని తాను బ‌బ్బ‌ర్ షేర్ అనుకుంటున్నార‌ని.. ఆయ‌న బబ్బ‌ర్ షేర్ కాద‌ని పేప‌ర్ పులి అని సెటైర్ వేసారు.