Kalvakuntla Kavitha: అవినీతిపరుడు అన్నారు.. మరి ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?
Kalvakuntla Kavitha: మహేందర్ రెడ్డిని (mahender reddy) అవినీతిపరుడు అని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం మరి TSPSCకి ఛైర్మన్‌గా ఎలా నియమించింది అని ప్రశ్నించారు BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. “” KCR చేసిన పనులే మీరు చేస్తే ఇక మీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణలో. KCR చేసిన పనులు కాకుండా కొత్త పనులు చేయండి. దీంతో పాటు చాలా పెద్ద ఎత్తున KCR ప్రభుత్వాన్ని ధూషించడంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ముందున్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. ఆ ఆరోపణల్లో మహేందర్ రెడ్డి అని మాజీ డీజీపీ కూడా ఉన్నారు.
ఆయనను పట్టుకుని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని BRS ప్రభుత్వంలో ఐదు సార్లు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని BRS తీసుకున్న అనేక నిర్ణయాలపై పట్టున్న డీజీపీని తీసుకొచ్చి ఈరోజు TSPSCకి ఛైర్మన్‌ని చేసారు. మరి ఆనాడు ఏమన్నారు.. KCR గారు ఎవరైనా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలను నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయినవారిని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు అని విమర్శించారు. ఇప్పుడు మీరూ అదే చేస్తున్నారు. అక్కడి వరకు ఓకే అనుకుందాం.
TSPSCలో ఆరుగురు సభ్యులు ఉంటే ఆనాడు రేవంత్ రెడ్డి విమర్శ ఏంటంటే.. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారు అన్నారు. ఛైర్మన్ కూడా రిటైర్డ్ ఉద్యోగి. ఆయన్ను పెట్టుకున్నారు. ఆ తర్వాత యారబాడి రామ్మోహన్ రావు అనే సభ్యుడిని వేసారు. ఆయన అసలు తెలంగాణ వాసే కాదు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాన్ని ఇచ్చే దానిలో ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని నియమిస్తే కరెక్ట్‌గా ఉద్యోగాలు ఇస్తారో లేదో రేవంత్ చెప్పాలి. రాజకీయ వ్యక్తులను లో వేయం అని చెప్పారు. మరి పాల్వాయి రజనీని ఎందుకు పెట్టారు? మా ప్రభుత్వం ఆనాడు తప్పు చేసిందని ఆరోపించారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? మేం తప్పు చేసాం అన్నప్పుడు దానిని ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు సరిచేయొచ్చు కదా?
మీరు సరిచేయకుండా అన్ని ఉల్లంఘనలు చేసారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్నగాక మొన్న మాజీ డీజీపీని TSPSCకి ఛైర్మన్‌ని చేసారు. ఆయనపై ఆరోపణలు చేసారు. లక్ష కోట్ల రూపాయలు సంపాదించారు అని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. తక్షిణమే మహేందర్ రెడ్డిని TSPSC నుంచి తొలగించాలి. జ్యూడిషియల్ ఎంక్వైరీ ఆయనపై వేయాలి. ఇదే డిమాండ్‌తో త్వరలో గవర్నర్‌ని రిక్వెస్ట్ చేస్తాం. నా బాధేంటంటే.. బాలేదు బాలేదు అని ఆరోపించిన కాంగ్రెస్.. ఒక అవినీతిపరుడైన వ్యక్తిని మళ్లీ TSPSC ఛైర్మన్‌ని ఎలా చేస్తారు?
ఇదివరకు KCR ఇచ్చిన ఉద్యోగాలనే మళ్లీ మేం ఇస్తున్నాం అని కొత్తగా ప్రకటించుకుంటున్నారు. సింగరేణి, అంగన్వాడీ ఉద్యోగాలు, స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా KCR నోటిఫై చేసినవే. మీరు చేయకుండా మేం చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడం మానేసి ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి ఎలాగైతే వచ్చారో దానిని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మహేందర్ రెడ్డిపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాను. దీంతో పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైన సంస్థ. అందులో కూడా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ సభ్యులనే నింపారు. నలుగురు డైరెక్టర్లలో ముగ్గురు ఏపీ వారు ఉన్నారు. దాని వల్ల హైదరబాద్, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో నాలుగు గంటల పాటు కరెంట్ తీసేస్తున్నారు. ఇక రైతులను పట్టించుకోవడంలేదు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీని పరిస్థితి “” అని విమర్శలు గుప్పించారు.