కవితకు షాక్.. సింగరేణి యూనియన్ పోస్ట్ నుంచి ఔట్
Kalvakuntla Kavitha: భారత రాష్ట్ర సమితి (BRS) కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. దాంతో 14 రోజుల పాటు కవితను తిహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కవితకు మరో షాక్కు తగిలింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం యూనియన్ లీడర్ పదవి నుంచి తొలగించారు. ఈ సంఘానికి కవిత 2017 నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడంతో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పించారు. ఇక సింగరేణి సంస్థ ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు పెట్టుకోమని.. ఇక నుంచి సింగరేణి సంస్థ స్వతంత్రంగానే పనిచేస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ మిరియాల రాజి రెడ్డి తెలిపారు.
ALSO READ: Kavitha Arrest: 14 రోజులు జైల్లో…అసలు ఈడీ కోర్టుకు ఏం చెప్పింది?