Kavitha: పోలింగ్ రోజు సెలవు లేదు.. ఓపిక తెచ్చుకుని ఓటెయ్యండి
Kavitha: BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్మపురిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) పోటీ చేస్తున్నారు. ఈశ్వర్ తరఫు ప్రచారం చేసేందుకు కవిత వచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పోలింగ్ రోజు సెలవు లేదని.. యువకులు ఎందుకు వచ్చిందిలే అని నిద్రపోకుండా వేరే పనులు పెట్టుకోకుండా ఓపిక తెచ్చుకుని లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో వారు ఓపిక లేకనో బద్ధకం వల్లనో ఓటు వేయకపోతే వారికి ఓటు విలువ తెలియజేసి వేయించాలని కోరారు.