Kakani Govardhan Reddy: HYDRAA కంటే ముందు జగన్ ప్లాన్ వేసారు
Kakani Govardhan Reddy: తెలంగాణలో హైడ్రా సంస్థ అక్రమ కట్టడాలను ఇప్పుడిప్పుడు కూల్చివేస్తోందని.. కానీ తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడే అక్రమ కట్టడాలను తొలగించడం మొదలుపెట్టారని అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ ఆలోచనతోనే ప్రజల సొమ్మును వాడి నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసినట్లు చెప్పారు. తెలంగాణలో హైడ్రా సంస్థ కూల్చేస్తున్న నిర్మాణాలను కొన్ని టీవీ ఛానెళ్లు చాలా బాగా చూపిస్తున్నాయని.. కానీ చంద్రబాబు నాయుడు చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం చూపించకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలుగా ఏదన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. పోనీ మీరు వచ్చి చేయండి అని ఎగతాళి చేస్తున్నారని.. తాము చేసే మాటైతే ప్రజలు తెలుగు దేశం పార్టీ కూటమిని ఎందుకు గెలిపించినట్లని ప్రశ్నించారు.
“” చంద్రబాబు నాయుడు మాట్లాడితే విజయవాడ బాధితులను ఆదుకునేవరకు వరద ప్రాంతాలను వదిలి వెళ్లనని అంటున్నారు. ఎలా వెళ్తారు? ముంపులో ఆయన నివాసం కూడా మునిగిపోయింది. అందుకే వెళ్లను ఇక్కడే ఉంటా అని అంటున్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు చాలా సమర్ధవంతంగా చేసాం. ఇప్పుడు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మీరే చేయాలి. అంతేకానీ మీరు వచ్చి చేయండి అని మాపై అరిస్తే ఎలా? మేం చేసేదానికి మీకు ఎందుకు అధికారం? “” అని తెలిపారు.