Kailash Vijayvargiya: వ్యతిరేకంగా మాట్లాడితే వేసేస్తాం..!
Delhi: BJP నేత కైలాశ్ విజయవర్గియా (kailash vijayvargiya) చేసిన వ్యాఖ్యలు కాంట్రొవర్సీకి దారి తీసాయి. భారతదేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని వేసేయడానికి కూడా వెనుకాడం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఇండియా గురించి మంచిగా మాట్లాడేవారంతా మతకు సోదరులతో సమానం అని తప్పుగా మాట్లాడితే వేసేస్తామని పబ్లిక్‌గా బెదిరింపులకు పాల్పడ్డారు.
“” మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు. ఇండియా గురించి మంచిగా మాట్లాడేవారంతా మాకు సోదరులతో సమానం. అలాంటి వారి కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ భారత్ మాతాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం వారి ప్రాణాలు తీయడానికి మాత్రం వెనుకడాం“” అంటూ ఓ ఈవెంట్‌లో ఆయన పబ్లిక్‌గా కామెంట్స్ చేసారు.