Kadiyam Srihari: విద్యాశాఖ మంత్రి మీరే క‌దా సార్?

Kadiyam Srihari comments on then brs government

Kadiyam Srihari:  BRS నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన క‌డియం శ్రీహ‌రి.. గ‌త ప్ర‌భుత్వంలో విద్యాశాఖ నాశ‌మైంద‌ని అన‌డం విడ్డూరంగా ఉంది. పిల్లలు చదువుకుంటే ఎక్కడ గొప్ప‌వాళ్లు అవుతారో అని నాణ్యమైన విద్యను అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూరం చేశాడంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా చేసిన కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయడం గ‌మ‌నార్హం.