KA Paul: తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి
KA Paul: తిరుమల లడ్డూ వివాదం నెలకొన్న వేళ ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అలా చేస్తేనే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే గొడవలు ఉండవని అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన కల్తీని తాను ఖండిస్తున్నానని అన్నారు.
“” పవన్ కళ్యాణ్.. నువ్వు మతాల మధ్య చిచ్చు పెడుతున్నావ్. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా అనర్హుడివి కావు. వెంటనే రాజీనామా చేయ్. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో నాకెంతో బాధేసింది. దానిని నేను ఖండిస్తున్నాను. చిన్నప్పుడు మా నాన్న ఇంకా క్రిస్టియన్గా మారకముందే నన్ను తిరుపతికి తీసుకెళ్లి పాపనాశనంలో స్నానం చేయించారు. నాకు శ్రీనివాస్ అని పేరుపెట్టారు. నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది. అందుకే తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తే 3 లక్షల కోట్ల సంపదను కాపాడినవాళ్లం అవుతాం. అధికారంలోకి రాకముందు 30 వేల మంది ఆడపిల్లలు అపహరణకు గురయ్యారు అన్నావ్. మరి వారి గురించి ప్రాయశ్చిత్త దీక్ష చేయలేదేం? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి చేయలేదేం? ఇలాంటి పనులు చేస్తే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్. నా మాట వింటే చరిత్రలో హీరోగా ఉంటావ్. నీకు నిజంగా నీ రాష్ట్ర ప్రజల పట్ల అంత భక్తి ఉంటే ముందు ఆ స్టీల్ ప్లాంట్ కోసం నాతో పాటు ధర్నాలో పాల్గొను. లేదంటే మౌనవ్రతం పాటించు. అంతేకానీ ఇలాంటి మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు పనులు చేయకు “” అని వెల్లడించారు.