Pawan..ఈ అడుక్కుతినే బతుకు మనకు అవసరమా?
జనసేనను (janasena) ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని అంటున్నారు కేఏ పాల్ (ka paul). ఈ మేరకు ఆయన జనసేనాని పవన్‌కు (pawan) ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. “” తమ్ముడు పవన్ కళ్యాణ్.. నిన్ను అందరూ ప్యాకేజీ కుక్క అంటున్నారు. ఎందుకు ఓట్ల కోసం బీజేపీని అడుక్కుంటున్నావు. నువ్వు అడిగినంత మాత్రాన నీకు ఓట్లు పడవు. ఈ అడుక్కు తినే బతుకు ఎందుకు మనకు. నువ్వు హాయిగా నీ పార్టీని నా పార్టీలో విలీనం చెయ్యి. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడను అని పవన్ అన్నాడు. మళ్లీ మోదీనే గెలిపించమంటున్నారు. అందుకే పవన్ ఆయన ఫ్యాన్స్ నా పార్టీలో చేరండి. అప్పుడు పవన్ ఎవడి జెండా మోయక్కర్లేదు. మన జెండానే మోసుకుందాం. కాపులు 27% ఉన్నాం. నేనెందుకు సీఎం అవ్వకూడదు. పవన్ కళ్యాణ్‌ని చేస్తాను అంటే ఆయన వద్దన్నాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కి అమ్మేసారు. ఇప్పుడు జనసేనను బీజేపీకి అమ్మేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ? మోదీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్సార్ అడుక్కుంటే నేను ఇచ్చారు వారికి. నువ్వెందుకు వారి చేత మాటలు పడతావు? వచ్చేసేయ్ మన పార్టీలోకి. నువ్వు నీ పార్టీని నా పార్టీలో విలీనం చేసేయ్. నిన్ను ఇంటర్నేషనల్ స్టార్‌ని చేస్తాను. నాకు ఏంజిలినా జోలీ, బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ లాంటి పెద్దవాళ్లతో కాంటాక్ట్స్ ఉన్నాయి. నువ్వు హాయిగా సినిమాలు చేస్కో హాలీవుడ్‌లో “” అంటూ ఆఫర్ ఇచ్చారు పాల్. (pawan)