KA Paul: ఆ పవన్ కళ్యాణ్ గాడేమో పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్లు ఎక్స్‌ట్రాలు
KA Paul: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సెటైర్లు వేసారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎన్నికల్లో ఎన్డీయేతో చేతులు కలపడానికి ముందే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే చేతులు కలుపుతామని పట్టుబట్టి ఉంటే ఈరోజు రాష్ట్రానికి అప్పు ద్వారా నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు.
అది వదిలేసి చంద్రబాబు నాయుడు పవన్ గాడు ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్లు జుట్టు సవరించుకుంటూ ఎక్స్‌ట్రాలు అంటూ సెటైర్లు వేసారు. కనీసం ఇప్పుడైనా తాను ఢిల్లీలో చేయబోయే ధర్నాలో తనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పార్టీలు పాల్గొంటే కావాల్సిన నిధులన్నీ అడిగి తెచ్చుకుందామని.. తనకు మద్దతు తెలపకపోతే తనకు నష్టమేమీ లేదని కానీ తాను మాత్రం కచ్చితంగా ధర్నా చేస్తానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నానని.. తనకు ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా తాను మాత్రం తన తెలుగు ప్రజల కోసం పోరాడి తీరతానని శపథం చేసారు.
“” నేను ముందే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను హెచ్చరించాను. చంద్రబాబు నాయుడుని నమ్మకండి అని. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. గత 14 ఏళ్లలో బాబు అధికారంలో ఉన్నాడు. మరి జాబులు తెచ్చాడేంటి? అసలు ఆయనకు జాబులు తేవడం తెలుసా? మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని ఐటీ కంపెనీలకు చెందిన పెద్దలు నా మీటింగ్‌లకు అటెండ్ అవుతారు. కనీసం ఆ కంపెనీల ఓనర్ల పేర్లైనా బాబుకి తెలుసా? బాబు జైలుకి వెళ్లకుండా ఉండేందుకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ఒక్కటే జైలు ఒక్కటే. మోదీని ఘోరంగా తిట్టి ఇప్పుడు మళ్లీ ఆయన కాళ్లు పట్టుకుంటున్నాడు. ఆ అవసరం ఏముంది? తెలుగు సత్తా ఎన్టీఆర్ దగ్గర నేర్చుకోవాల్సిందిపోయి ఇలా అడ్డుక్కోవడం ఏంటి? “” అని వ్యాఖ్యానించారు.